Jaya Jaya He Telangana: ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు తుది మెరుగులు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో పూర్తి గీతాన్ని 13.30 నిమిషాల నిడివితో రూపొందించారు. రాష్ట్ర అధికారిక కార్యక్రమాల్లో, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆలపించడానికి వీలుగా.. 2.30 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందెశ్రీ దీన్ని తీర్చిదిద్దారు. ఈ రెండు గీతాలకు కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు. […]