Tarun Mannepalli Badminton : విజేత తరుణ్‌ మన్నేపల్లి    

కజకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన తరుణ్‌ మన్నేపల్లి విజేతగా నిలిచాడు. అస్తానాలో శనివారం జరిగిన ఫైనల్లో తరుణ్‌ 21–10, 21–19 స్కోరుతో ఎనిమిదో సీడ్, మలేసియాకు చెందిన సూంగ్‌ జూ విన్‌పై విజయం సాధించాడు. గత ఏడాది జాతీయ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన తరుణ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్‌ కావడం విశేషం. మహిళల సింగిల్స్‌లో భారత షట్లర్‌ అనుపమ ఉపాధ్యాయ టైటిల్‌ సాధించింది. ఫైనల్లో భారత్‌కే చెందిన ఇషారాణి […]