Liqour Scam Case Kejriwal : లిక్కర్‌ స్కాం కేసు: సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌ ఎమర్జెన్సీ పిటిషన్‌

లిక్కర్‌ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన ఈ ఉదయం అత్యవసర పిటిషన్‌ వేయబోనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను స్పెషల్‌ మెన్షన్‌ చేయాలని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరేందుకు కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ కోరారు. అయితే […]

Supreme Court is again angry on Baba Ramdev ; : బాబా రాందేవ్‌పై మళ్లీ సుప్రీంకోర్టు ఆగ్రహం

పతంజలి ఉత్పత్తుల తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు సుప్రీం కోర్టులో ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ పిటిషన్‌పై విచారణ పతంజలి నిర్వాహకులు బాబా రాందేవ్‌, బాలకృష్ణ మళ్లీ ఫైర్‌ అయిన ధర్మాసనం భేషరతు క్షమాపణల అఫిడవిట్లను తోసిపుచ్చిన కోర్టు ఏప్రిల్‌ 16న ఆదేశాలు జారీ చేస్తామన్న ధర్మాసనం ఉత్తరాఖండ్‌ అధికార యంత్రాంగం పైన ఆగ్రహం వెల్లగక్కిన సర్వోన్నత న్యాయస్థానం కరోనిల్‌ కేంద్రం నివేదికపైనా సుప్రీం అసంతృప్తి  కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి ఆయుర్వేద నిర్వాహకులు బాబా రాందేవ్‌, బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి మండిపడింది. తామేం అంధులం కాదని, […]

Supreme Court : సీఎం బంధువులకు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు ఇవ్వొచ్చా?

ముఖ్యమంత్రి దగ్గరి బంధువులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టొచ్చా? ఒకవేళ అలాచేస్తే ఎలాంటి నిబంధనలు పాటించాలి? అని సుప్రీం కోర్టు కాగ్‌ అభిప్రాయాన్ని కోరింది. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కేసులో జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ కాగ్‌ను రెండు అంశాలపై అభిప్రాయం కోరింది. 1. రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ అధినేత బంధువులకు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు కట్టబెట్టొచ్చా? 2. ఒకవేళ ఇవ్వొచ్చని చెబితే, అలాంటి వ్యక్తులకు కాంట్రాక్ట్‌లు అప్పగించేటప్పుడు ఎలాంటి […]

Supreme Court – ఈడీ అధికారాలపై మా తీర్పును అవసరమైతే పునఃసమీక్షిస్తాం

హవాలా కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో అరెస్టులకు, ఆస్తుల అటాచ్‌మెంటుకు ఈడీకి అధికారాలు ఉంటాయంటూ 2022లో తాము ఇచ్చిన తీర్పును అవసరమైతే పునఃసమీక్షిస్తామని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సారథ్యంలోని ప్రత్యేక ధర్మాసనం దీనిపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ.. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టానికి సంబంధించిన పలు అంశాలను త్రిసభ్య ధర్మాసనం ఇప్పటికే పరిష్కరించినట్లు పేర్కొంది. ఇందులో ఎక్కడైనా పునరాలోచన అవసరమా అన్నదే ఇపుడు ముఖ్యమైన అంశమని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ బేలా […]

Ram Setu : పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది

తమిళనాడు ఆగ్నేయ తీరం-శ్రీలంక వాయవ్య తీరం మధ్య సముద్రంలో విస్తరించిన ‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించడంతోపాటు ఆ ప్రాంతంలో ఇరువైపులా గోడ నిర్మించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇవి కేవలం పాలనాపరమైన అంశాలని పేర్కొంటూ జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధులియాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. హిందూ పర్సనల్‌ లా బోర్డు అధ్యక్షుడు, న్యాయవాది అశోక్‌ పాండే ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. […]

A Rare case :- సుప్రీంకోర్టు వాదన సమయంలో సంకేత భాష …

దివ్యాంగురాలైన న్యాయవాది ఓ కేసులో వాదనలు వినిపించడానికి సంజ్ఞల భాష నిపుణుడిని అనుమతించిన అరుదైన ఘట్టం సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. ఈ నెల 22న వర్చువల్‌ విధానంలో కేసు విచారణËను ఓ వ్యక్తి సంజ్ఞలతో వివరించడం న్యాయవాదులను ఆశ్చర్యానికి గురిచేసింది. కేరళకు చెందిన సారా సన్నీకి పుట్టుకతో వినికిడి లోపం ఉంది. అయినప్పటికీ పట్టుదలతో న్యాయవిద్యను పూర్తిచేసి, ప్రముఖ న్యాయవాది సంచితా ఐన్‌ వద్ద జూనియర్‌గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఓ కేసు విచారణలో భాగంగా […]