#Mayank Yadav: ఐపీఎల్ హిస్టరీలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా మయాంక్ సంచలన రికార్డు
మయాంక్ యాదవ్.. 21 ఏళ్ల ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లోకి ఓ బుల్లెట్‌లా దూసుకువచ్చాడు. అరంగేట్రంలోనే తన స్పీడ్ పవర్‌తో సత్తా చాటిన ఈ యువ ఫాస్ట్ బౌలర్.. రెండో మ్యాచ్‌లోనూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన పేస్ పదునుతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లకు చెమటలు పట్టించిన మయాంక్.. లక్నోను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన స్పెల్(3/14)తో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు ఈ యంగ్ స్పీడ్ గన్. […]