CHESS ARJUN : భారత నంబర్‌వన్‌గా అర్జున్‌

 హైదరాబాద్‌: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఓపెన్‌ విభాగం క్లాసికల్‌ ఫార్మాట్‌లో అధికారికంగా భారత నంబర్‌వన్‌ ప్లేయర్‌గా అర్జున్‌ అవతరించాడు. ఏప్రిల్‌ నెలకు సంబంధించి అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) విడుదల చేసిన క్లాసికల్‌ ఫార్మాట్‌ రేటింగ్స్‌లో 20 ఏళ్ల అర్జున్‌ 2756 పాయింట్లతో ప్రపంచ 9వ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ను అధిగమించి భారత టాప్‌ […]

#Mayank Yadav: ఐపీఎల్‌ హిస్టరీలో తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా మయాంక్‌ సంచలన రికార్డు

మయాంక్‌ యాదవ్‌.. 21 ఏళ్ల ఈ లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్‌లోకి ఓ బుల్లెట్‌లా దూసుకువచ్చాడు. అరంగేట్రంలోనే తన స్పీడ్‌ పవర్‌తో సత్తా చాటిన ఈ యువ ఫాస్ట్‌ బౌలర్‌.. రెండో మ్యాచ్‌లోనూ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.  తన పేస్‌ పదునుతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటర్లకు చెమటలు పట్టించిన మయాంక్‌.. లక్నోను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన స్పెల్‌(3/14)తో ఆర్సీబీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు ఈ యంగ్‌ స్పీడ్‌ గన్‌.  […]

Pakistan Cricket: Pakistani cricketers are given strict training by the army పాక్‌ క్రికెటర్ల కోసం ఆ దేశ సైన్యం తమ క్యాంప్‌లో ఆటగాళ్లకు కఠిన శిక్షణ ఇస్తోంది.

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొద్ది రోజులుగా భారీ సిక్సర్లు కొట్టడంలో పాకిస్థాన్‌ క్రికెటర్లు (Pakistan Cricket) విఫలమవుతున్నారు. దీనిపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా ఆర్మీ (Pak Army)ని రంగంలోకి దింపింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ నేతృత్వంలోని జట్టును రెండు వారాల పాటు సైనిక శిక్షణ (Millitary Training)కు పంపింది. ప్రస్తుతం వీరంతా కాకుల్‌లోని ఆర్మీ స్కూల్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో […]

IPL 2024: ముంబై కెప్టెన్‌గా మళ్లీ రోహిత్.. ఏప్రిల్ 7లోపు కీలక ప్రకటన: టీమిండియా మాజీ క్రికెటర్..

IPL 2024, Hardik Pandya: రాజస్థాన్ రాయల్స్ చేతిలో 6 వికెట్ల ఓటమితో ముంబై ఇండియన్స్ శిబిరంలో ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి షోలో పాల్గొన్న మనోజ్ తివారీ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా ఒత్తిడిలో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అందుకే హార్దిక్ పాండ్యా రాజస్థాన్‌పై ముంబైకి బౌలింగ్ చేయలేదంటూ చెప్పుకొచ్చాడు. IPL 2024, Hardik Pandya: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ 2024 సీజన్ ఇప్పటివరకు చాలా చెత్తగా మారింది. […]

Pakistan captain change.. Rizwan’s best choice: Shahid Afridi పాక్‌ కెప్టెన్‌ మార్పు.. రిజ్వాన్‌ బెస్ట్‌ ఛాయిస్‌: షాహిద్‌ అఫ్రిది

పాకిస్థాన్‌ జట్టుకు మళ్లీ కెప్టెన్‌గా వచ్చిన బాబర్ అజామ్‌పై షాహిద్‌ అఫ్రిది తన అక్కసు వెళ్లగక్కాడు. బాబర్‌ కంటే రిజ్వాన్ మంచి ఎంపిక అవుతుందని వ్యాఖ్యానించాడు. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ క్రికెట్‌లో కెప్టెన్సీ వ్యవహారంపై రగడ కొనసాగుతూనే ఉంది. గత వన్డే ప్రపంచ కప్ తర్వాత సారథ్యం నుంచి తప్పించిన బాబర్‌ అజామ్‌కే మళ్లీ కెప్టెన్సీ అప్పగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. వన్డే, టీ20 జట్టు పగ్గాలను అతడికి అప్పగించిన బోర్డు.. టెస్టులకు మాత్రం షాన్‌ మసూద్‌నే […]

Babar Azam: Pakistan Cricketer బాబర్‌ అజామ్‌కు మళ్లీ పాకిస్థాన్‌ కెప్టెన్సీ బాధ్యతలు.. 

పాకిస్థాన్‌ క్రికెట్ జట్టు బాధ్యతలను మళ్లీ బాబర్ అజామ్‌కు అప్పగిస్తూ ఆ దేశ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే ప్రపంచ కప్‌ తర్వాత పాకిస్థాన్‌ జట్టు సారథ్య బాధ్యతల నుంచి బాబర్‌ అజామ్‌ను (Babar Azam) తప్పించిన సంగతి తెలిసిందే. టీ20లకు షహీన్‌ అఫ్రిది, టెస్టులకు షాన్‌ మసూద్‌ను కెప్టెన్లుగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నియమించింది. టీ20 ప్రపంచ కప్‌ సమీపిస్తున్న తరుణంలో మరోసారి పాక్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు […]

SRH vs GT: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. 

SRH vs GT, IPL 2024: గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు జట్టు పునరాగమనం పరిశీలనలో ఉంది. సొంత మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ ఓడించింది. ఆ జట్టు 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ ఓడి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో […]

IPL 2024: ఐపీఎల్ హిస్టరీలోనే 9 టీంలతో ఆడిన ఆస్ట్రేలియా ప్లేయర్.. ఎవరో తెలుసా?IPL 2024: 

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో 9 జట్లకు ఆడిన ఏకైక ఆటగాడిగా ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ కూడా కావడం విశేషం. దీంతో ఐపీఎల్‌లో ప్రత్యేక రికార్డు సృష్టించిన ఆసీస్ క్రికెటర్ ఇప్పుడు అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఆయనెవరు, ఏయే జట్ల తరపున ఆడాడో ఇప్పుడు చూద్దాం.. Australia Player Aaron Finch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు ఎవరు? […]

BADMINTON : Sikki-Sumeet pair in semis సెమీస్‌లో సిక్కి–సుమీత్‌ జోడి 

క్వార్టర్స్‌లో ఓడిన సింధు  స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌  మాడ్రిడ్‌: బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ (సూపర్‌ 300) టోర్నీ స్పెయిన్‌ మాస్టర్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు ఓడగా…మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి రెడ్డి – సుమీత్‌ రెడ్డి జోడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌లో, పురుషుల డబుల్స్‌లో కూడా భారత జోడీలు క్వార్టర్స్‌లో వెనుదిరిగాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సింధు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో […]

MS Dhoni: మాకు కొత్త కెప్టెన్‌ ఉన్నాడు..: యాంకర్‌ ప్రశ్నకు ధోనీ సమాధానం

సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై జట్టు ఐపీఎల్ 17వ సీజన్‌లోనూ దూసుకుపోతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తరఫున తొలిసారి మెగా టోర్నీలో అడుగు పెట్టిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అయితే, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ను డ్రాప్‌ చేశాడు. ఇదే విషయాన్ని ఓ […]