IPL 2024 – ఐపీఎల్‌లో నేడు మరో బిగ్‌ ఫైట్‌.. సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనున్న పంజాబ్‌

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 9) మరో బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. ఓ మోస్తరు జట్టైన పంజాబ్‌ కింగ్స్‌.. చిచ్చరపిడుగులతో నిండిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ముల్లన్‌పూర్‌లోని (చంఢీఘడ్‌) మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి. పంజాబ్‌ గత మ్యాచ్‌లో గుజరాత్‌పై సంచలన విజయం సాధించగా.. సన్‌రైజర్స్‌ గత మ్యాచ్‌లో […]

Harry Brooke :  హ్యారీ బ్రూక్‌ విధ్వంసం సృష్టించాడు.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2024లో (డివిజన్‌ 2) భాగంగా లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌, యార్క్‌షైర్‌ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 69 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం బాదాడు. ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. వ్యక్తిగత కారణాల చేత ఐపీఎల్‌ 2024 నుంచి తప్పుకున్న తర్వాత బ్రూక్‌ ఆడిన తొలి మ్యాచ్‌ ఇదే. ప్రస్తుత సీజన్‌ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్రూక్‌ను 4 […]

‘Fide’ Candidates Chess Tournament : విదిత్‌ గుజరాతీ సంచలన విజయం

హంపికి ‘డ్రా’  క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌  టొరంటో: ప్రతిష్టాత్మక ‘ఫిడే’ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో రెండో రౌండ్‌లో నాలుగు గేమ్‌లలో కూడా ఫలితం వచ్చింది. భారత గ్రాండ్‌మాస్టర్‌ విది త్‌ గుజరాతీ…అమెరికాకు చెందిన వరల్డ్‌ నంబర్‌ 3  హికారు నకమురాపై 29 ఎత్తుల్లో సంచలన విజయం సాధించడం విశేషం. వరుసగా 47 గేమ్‌లలో ఓటమి లేకుండా కొనసాగిన నకమురా విజయయాత్రకు విదిత్‌ బ్రేక్‌ వేశాడు. భారత ఆటగాళ్ల మధ్య జరిగిన పోరులో డి.గుకేశ్‌ 33 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించాడు. […]

IPL -2024 Sehwag About Kohli కోహ్లి ఆ తప్పు చేయకపోయి ఉంటేనా..: సెహ్వాగ్‌

‘‘ఇలాంటి ప్రశ్నలకు జవాబు మీకు కూడా తెలుసు కదా? అయినా ప్రతిసారీ మమ్మల్నే ఎందుకు ఇలా కఠినమైన ప్రశ్నలు అడుగుతారు? మాతో బ్యాడ్‌ కామెంట్స్‌ చెప్పించాలనే కదా మీ ప్రయత్నం. 183 పరుగులు చాలా? విరాట్‌ కోహ్లి స్లోగా ఆడాడా? ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదిగా సాగిందా? లేదంటే.. ఆర్సీబీ ఇంకా కనీసం 20 పరుగులు చేయాల్సిందా? ఇలాంటి ప్రశ్నలకు మీరు కూడా సమాధానం చెప్పవచ్చు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనకు ప్రశ్నలు సంధించిన […]

IPL : Sunrisers won on Chennai: చెన్నై పై సన్‌రైజర్స్‌ ఘన విజయం సాధించింది

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ సత్తాచాటింది. హైదరాబాద్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మెరిసింది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. మొదటి నుంచి చివరి బంతి వరకు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు సాధించింది. శివమ్‌ దూబె (45; 24 బంతుల్లో […]

IPL 2024 CSK vs SRH : సీఎం రేవంత్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు.

ఒకవైపు పరిపాలన వ్యవహారాలు.. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు, ఇంకోవైపు శనివారం జరగబోయే తుక్కుగూడ జనజాతర సభ ఏర్పాట్లు.. ఇలా అనుక్షణం రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆటవిడుపుగా.. శుక్రవారం రాత్రి ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు. ఒకవైపు పరిపాలన వ్యవహారాలు.. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు, ఇంకోవైపు శనివారం జరగబోయే తుక్కుగూడ జనజాతర సభ ఏర్పాట్లు.. ఇలా అనుక్షణం రాజకీయ […]

IPL 2024, GT vs PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్‌ కింగ్స్‌

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక సార్లు 200 అంతకు పైగా లక్ష్యాలను ఛేదించిన జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ చరిత్ర సృష్టించింది. నిన్న గుజరాత్‌పై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో పంజాబ్‌ కింగ్స్‌ ఈ రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్‌లో పంజాబ్‌ ఇప్పటివరకు ఆరుసార్లు 200 అంతకంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించింది. పంజాబ్‌ తర్వాత ముంబై ఇండియన్స్‌ అత్యధిక సార్లు (5) 200 ఆపైచిలుకు లక్ష్యాలను ఛేదించింది.  మ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ […]

IPL 2024 GT VS PBKS:  శుభ్‌మన్‌ గిల్‌ కిర్రాక్‌ ఇన్నింగ్స్‌.. సీజన్‌ టాప్‌ స్కోర్‌

పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 4) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కిర్రాక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ అయ్యాక తొలి హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ సీజన్‌లో గిల్‌ తొలిసారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 48 బంతులు ఎదుర్కొన్న గిల్‌ 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ ఓటమిపాలైనప్పటికీ గిల్‌ ఇన్నింగ్స్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో […]

IPL : ABD Comments on RCB : ఆర్సీబీ వరుస వైఫల్యాలపై ఏబీడీ కీలక వ్యాఖ్యలు..

 రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్రదర్శనపై ఆ జట్టు మాజీ ఆటగాడు, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ స్పందించాడు. తాజా ఎడిషన్‌ను ఆర్సీబీ మరీ చెత్తగా ఏమీ ఆరంభించలేదని.. అలా అని అంతగొప్పగా ఏమీ రాణించడం లేదని పేర్కొన్నాడు.  కాగా ఐపీఎల్‌ పదిహేడో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ- డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో తలపడింది. చెపాక్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచి […]

Paris Olympics : Food in Olympics పారిస్‌ ఒలింపిక్స్‌లో పప్పు, అన్నం

ఒలింపిక్స్‌ సహా విదేశాల్లో ఏ ప్రతిష్ఠాత్మక పోటీలు జరిగినా భోజనం విషయంలో భారత అథ్లెట్లకు ఇబ్బందులు తప్పవు. కానీ ఈ ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆ సమస్య ఉండదు. దిల్లీ: ఒలింపిక్స్‌ సహా విదేశాల్లో ఏ ప్రతిష్ఠాత్మక పోటీలు జరిగినా భోజనం విషయంలో భారత అథ్లెట్లకు ఇబ్బందులు తప్పవు. కానీ ఈ ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆ సమస్య ఉండదు. అథ్లెట్ల గ్రామంలో మనవాళ్లు ఎంచక్కా.. బాస్మతి బియ్యంతో చేసిన అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ- గోబీ, […]