IPL : Sunrisers won on Chennai: చెన్నై పై సన్‌రైజర్స్‌ ఘన విజయం సాధించింది

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ సత్తాచాటింది. హైదరాబాద్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మెరిసింది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. మొదటి నుంచి చివరి బంతి వరకు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు సాధించింది. శివమ్‌ దూబె (45; 24 బంతుల్లో […]

IPL 2024 CSK vs SRH : సీఎం రేవంత్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు.

ఒకవైపు పరిపాలన వ్యవహారాలు.. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు, ఇంకోవైపు శనివారం జరగబోయే తుక్కుగూడ జనజాతర సభ ఏర్పాట్లు.. ఇలా అనుక్షణం రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆటవిడుపుగా.. శుక్రవారం రాత్రి ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు హాజరై సందడి చేశారు. ఒకవైపు పరిపాలన వ్యవహారాలు.. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు, ఇంకోవైపు శనివారం జరగబోయే తుక్కుగూడ జనజాతర సభ ఏర్పాట్లు.. ఇలా అనుక్షణం రాజకీయ […]

IPL 2024, GT vs PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్‌ కింగ్స్‌

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక సార్లు 200 అంతకు పైగా లక్ష్యాలను ఛేదించిన జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ చరిత్ర సృష్టించింది. నిన్న గుజరాత్‌పై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో పంజాబ్‌ కింగ్స్‌ ఈ రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్‌లో పంజాబ్‌ ఇప్పటివరకు ఆరుసార్లు 200 అంతకంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించింది. పంజాబ్‌ తర్వాత ముంబై ఇండియన్స్‌ అత్యధిక సార్లు (5) 200 ఆపైచిలుకు లక్ష్యాలను ఛేదించింది.  మ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ […]

IPL 2024 GT VS PBKS:  శుభ్‌మన్‌ గిల్‌ కిర్రాక్‌ ఇన్నింగ్స్‌.. సీజన్‌ టాప్‌ స్కోర్‌

పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 4) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కిర్రాక్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ అయ్యాక తొలి హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ సీజన్‌లో గిల్‌ తొలిసారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 48 బంతులు ఎదుర్కొన్న గిల్‌ 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ ఓటమిపాలైనప్పటికీ గిల్‌ ఇన్నింగ్స్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో […]

Paris Olympics : Food in Olympics పారిస్‌ ఒలింపిక్స్‌లో పప్పు, అన్నం

ఒలింపిక్స్‌ సహా విదేశాల్లో ఏ ప్రతిష్ఠాత్మక పోటీలు జరిగినా భోజనం విషయంలో భారత అథ్లెట్లకు ఇబ్బందులు తప్పవు. కానీ ఈ ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆ సమస్య ఉండదు. దిల్లీ: ఒలింపిక్స్‌ సహా విదేశాల్లో ఏ ప్రతిష్ఠాత్మక పోటీలు జరిగినా భోజనం విషయంలో భారత అథ్లెట్లకు ఇబ్బందులు తప్పవు. కానీ ఈ ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆ సమస్య ఉండదు. అథ్లెట్ల గ్రామంలో మనవాళ్లు ఎంచక్కా.. బాస్మతి బియ్యంతో చేసిన అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ- గోబీ, […]

  • 1
  • 2