Software Engineer: మహిళా టెకీతో అసభ్యంగా ప్రవర్తించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్టు

పక్క సీటులో కూర్చున్న తిరుపతికి చెందిన మహిళా టెకీ(35)ని తాకి, అసభ్యంగా ప్రవర్తించిన తిరుచికి చెందిన రంగనాథ్‌ (50) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరును కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. గత సోమవారం ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి బెంగళూరుకు వస్తున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో మహిళ పక్క సీట్లోనే నిందితుడు కూర్చున్నాడు. నిద్రపోతున్న సమయంలో తనను ఎవరో తాకుతున్నట్లు గుర్తించి, ఆమె మేల్కొంది. వెంటనే విమానయాన సిబ్బందికి తెలిపింది. బెంగళూరుకు విమానం చేరుకున్న అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో […]