100 kg silver Ganesha idol.. – 100 కిలోల వెండి గణేశ విగ్రహం..

వినాయక చవితిని పురస్కరించుకుని మహారాష్ట్రలోని బుల్‌ఢాణా జిల్లాలో వంద కిలోల వెండి గణేశుడి ప్రతిమను తయారు చేశారు. జాల్నా జిల్లాలోని అనోఖా గణేశ్‌ మండల్‌ నిర్వాహకులు ఇచ్చిన ప్రత్యేక ఆర్డర్‌ మేరకు ఖామ్‌గావ్‌కు చెందిన విశ్వకర్మ సిల్వర్‌ హౌస్‌ ఈ విగ్రహాన్ని రూపొందించింది. ఐదుగురు స్థానిక కళాకారులు ఐదు నెలలు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఐదున్నర అడుగుల ఎత్తుతో ఉన్న ఈ వెండి విగ్రహం తయారీకి రూ.90 లక్షలు ఖర్చయినట్లు విశ్వకర్మ సిల్వర్‌ హౌస్‌ […]