Flash Floods : సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి మృతి..

సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరినట్లు ఆ రాష్ట్ర అధికారులు సోమవారం తెలిపారు. మృతుల్లో 10 మంది సైనికులు కూడా ఉన్నారు. ఇప్పటికీ ఆచూకీ దొరకని 105 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తీస్తా నదితీర ప్రాంతంలో 40 మృతదేహాలను వెలికితీసినట్లు పశ్చిమ బెంగాల్‌ అధికారులు తెలుపగా.. రెండు రాష్ట్రాలు చెప్పిన గణాంకాల్లో కొన్ని రెండు సార్లు లెక్కించి ఉండొచ్చని సిక్కిం అధికారులు చెబుతున్నారు. అలాగే వరదల్లో […]

Sikkim – కుదిపేసిన తీస్తా నది ఆకస్మిక వరదల ప్రభావం

ఈశాన్య రాష్ట్రం సిక్కింను కుదిపేసిన తీస్తా నది ఆకస్మిక వరదల ప్రభావం నుంచి ప్రజలు ఇపుడిపుడే తేరుకొంటున్నారు. ఆదివారం నాటికి గుర్తించిన మృతుల సంఖ్య 32కు చేరగా, ఇంకా 122 మంది ఆచూకీ తెలియడం లేదు. వీరి కోసం ప్రత్యేక రాడార్లు, డ్రోన్లు, ఆర్మీ జాగిలాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గుర్తించిన మృతుల్లో 9 మంది ఆర్మీ జవాన్లు ఉన్నారు. రాష్ట్రానికి జీవరేఖ లాంటి జాతీయ రహదారి-10 దారుణంగా దెబ్బతిని నిరుపయోగంగా మారింది. తీస్తా నది వెంబడి […]

Sikkim Floods – తీస్తా నదిలో కొట్టుకొస్తున్న ఆయుధాలు

తీస్తా నది పరీవాహక ప్రాంతం ఇంకా వరద గుప్పెట్లోనే ఉంది. సిక్కింతోపాటు ఇటు పశ్చిమ బెంగాల్‌లోని సరిహద్దు జిల్లాలు ఇబ్బందులు పడుతున్నాయి. సిక్కింలో ఏర్పాటుచేసిన సైనిక శిబిరాలు ఆకస్మిక వరదలకు కొట్టుకుపోవడంతో సైన్యానికి చెందిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీస్తా నదిలో బెంగాల్‌ దిశగా కొట్టుకువస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని జలపాయీగుడీ జిల్లాలో ఇలా కొట్టుకొచ్చిన మోర్టార్‌ షెల్‌ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో […]

‘Teesta’ Floods : సిక్కిం నుంచి బెంగాల్‌కు

కుంభవృష్టితో అతలాకుతలమైన ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim) ఇంకా వరద (Floods) గుప్పిట్లోనే ఉంది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన అతి భారీవర్షానికి తీస్తా నది ఉప్పొంగడంతో ఆకస్మికంగా వరద (Flash Floods) పోటెత్తింది. ఈ వరదల్లో మృతుల సంఖ్య 14కు పెరగ్గా.. మొత్తం 102 మంది గల్లంతయ్యారు. ఇందులో 22 మంది ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు దాదాపు రెండు వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. గల్లంతైన […]

Sikkim : సిక్కింలో మెరుపు వరదలు..

ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)లో ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. నిన్న రాత్రి కురిసిన కుండపోత వర్షానికి లాచెన్‌ లోయలో గల తీస్తా నది (Teesta River) ఉప్పొంగడంతో ఈ వరదలు చోటుచేసుకున్నాయి. ఇందులో 23 మంది ఆర్మీ సిబ్బంది (Army Personnel) గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో తీస్తా నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో చుంగ్‌థాంగ్‌ […]