Mellacheruvu: మహాశివరాత్రి జాతరకు మేళ్లచెరువు ముస్తాబు.. విభిన్న పోటీలకు సర్వం సిద్ధం..గెలిచిన వారికి..

ఎనిమిది విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో 80 బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ ఎద్దుల పోటీల్లో గెలిస్తే పరమశివుడి ఆశీస్సులు ఉంటాయని భక్తుల విశ్వాసం. ఐదు రోజులపాటు జరిగే మేళ్లచెరువు జాతరలో సాంఘిక పౌరాణిక నాటకాలు భక్తులను ఆకట్టుకొనున్నాయి. ఈ  ఐదు రోజులూ పురాణ ప్రవచనాలు, భాగవతోపన్యాసాలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతూ ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని ఇష్టకామేశ్వరి సమేత, స్వయంభు శంభులింగేశ్వరస్వామి వారి ఆలయం రాష్ట్రంలో దక్షిణకాశీగా విరాజిల్లుతోంది. మేళ్లచెరువు […]