RAMOJI Film City – ‘పుష్ప’.. ‘సలార్‌’ ఆటా పాటా

రామోజీ ఫిల్మ్‌సిటీ భారీ సినిమా చిత్రీకరణలతో సందడిగా ఉంది. ఓ వైపు ‘పుష్ప 2’ మరోవైపు ‘సలార్‌’ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నాయి చిత్ర బృందాలు. పాటన్నా… పుష్ప ఫైట్‌ అన్నా తగ్గేదేలే అన్నట్టుగా భారీగా ఉండాల్సిందే. ఇక జాతర నేపథ్యంలో సాగే పాటంటే మామూలుగా ఉంటుందా? జాతరంత సందడి కనిపించి తీరాల్సిందే. ‘పుష్ప 2’ కోసం సుమారు వెయ్యిమంది డ్యాన్సర్లపై జాతర నేపథ్యంలో సాగే పాటని తెరకెక్కిస్తున్నారు. గణేశ్‌ ఆచార్య ఈ పాటకి నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. […]