CINEMA : Jai Hanuman ‘అంజనాద్రి 2.0’.. ‘జై హనుమాన్‌’పై ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌

‘హనుమాన్‌’(Hanuman)తో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ (jai Hanuman) రానున్న విషయం తెలిసిందే.  హీరో చిత్రం ‘హనుమాన్‌’. సంక్రాంతి కానుకగా విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. దీనికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) రానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. దీంతో సీక్వెల్‌ అప్‌డేట్స్‌ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్‌ వర్మ స్పెషల్‌ గ్లింప్స్‌ షేర్‌ […]

HanuMan Movie OTT : రెండు ఓటీటీల్లో హనుమాన్‌.. అక్కడ హిందీలో.. ఇక్కడ తెలుగులో!

ఒకప్పుడు థియేటర్‌లో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? అని ఎదురుచూసేవారు. ఇప్పుడు థియేటర్‌తో పాటు అటు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? ఏ ఓటీటీలోకి వస్తుందా? అని ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. గత కొన్నాళ్లుగా హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌ కోసం వెబ్‌ వీక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ జియో సినిమాలో హనుమాన్‌ హిందీ వర్షన్‌ రిలీజ్‌ చేశారు. జియోలో స్ట్రీమింగ్‌నిన్న (మార్చి 16) రాత్రి 8 గంటల నుంచే జియో […]

Teja Sajja: తేజ సజ్జాకు మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌ అవార్డు.. ఇది ఆరంభం మాత్రమే అంటూ పోస్ట్‌

మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌గా తేజ సజ్జా అవార్డు అందుకున్నారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ సజ్జా (Teja Sajja).. ‘హనుమాన్‌’తో హీరోగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్రంలో హనుమంతు పాత్రతో మెప్పించారు. తాజాగా ఈ యంగ్‌ హీరో మోస్ట్ పాపులర్‌ యాక్టర్‌గా ‘గామా అవార్డు’ను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డు అందుకుంటున్న ఫొటోలను షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ‘దీన్ని హనుమంతుడికి అంకితమిస్తున్నా. ఈ అవార్డు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ‘హనుమాన్‌’కు […]