Sai Pallavi – వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది

కథ ఎంపికలో ఆచితూచి అడుగులేసే సాయిపల్లవి(Sai Pallavi) ఇప్పుడు వేగం పెంచుతోంది. వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో, తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ భారీ హిందీ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. రామాయణం ఇతివృత్తంతో దర్శకుడు నితీశ్‌ తివారి హిందీలో ఓ సినిమా రూపొందించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ కనిపించనుండగా.. సీత పాత్రను సాయిపల్లవి పోషించనున్నట్లు సమాచారం. […]