Kerala : రోల్స్‌ రాయిస్‌గా మారిన మారుతి 800 కారు

కేరళకు చెందిన 18 ఏళ్ల యువకుడు హదీఫ్‌… మారుతీ 800 కారును తక్కువ ఖర్చుతో రోల్స్‌ రాయిస్‌ తరహా కారుగా మార్చేశాడు. సాధారణ కార్లను లగ్జరీ కార్లుగా మార్చడంపై అతడికి ఉన్న ఆసక్తితోనే ఇది సాధ్యమైంది. ఇందుకోసం కొన్ని నెలలపాటు శ్రమించి, రూ.45 వేలు ఖర్చు చేశాడు. కొత్తగా ఆవిష్కరించిన కారు అద్దాలు, చక్రాలు, హెడ్‌లైట్స్‌ సహా వివిధ భాగాలను అందంగా మలిచాడు. ముందు భాగంలో ఉన్న లోగోను స్వయంగా అతడే రూపొందించడం గమనార్హం. వైరల్‌గా మారి […]