Agnibaan: అగ్నిబాణ్‌ విజయవంతం

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 7.15 గంటలకు అగ్నిబాణ్‌ రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపారు. శ్రీహరికోట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో ప్రైవేటు ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 7.15 గంటలకు అగ్నిబాణ్‌ రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపారు. రెండు నిమిషాలపాటు సాగిన ఈ ప్రయోగం స్వదేశీ అంతరిక్ష సాంకేతికత అభివృద్ధిలో సాధించిన గొప్ప విజయం. ఇది ఒక ప్రధాన మైలురాయి అని పేర్కొంటూ చెన్నై […]

Israel misses the target?… ఇజ్రాయెల్‌ టార్గెట్‌ మిస్‌?.. ఇరాన్‌ ఎంబసీపైకి మిస్సైళ్లు! 11 మంది మృతి

గాజా సంక్షోభ నేపథ్యంలో.. ప్రత్యర్థి దేశాలపై ఇజ్రాయెల్‌ తన దాడుల ఉధృతిని పెంచింది. తాజాగా సోమవారం సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ దౌత్య కార్యాలయంపై దాడి జరిపింది. ఈ దాడిలో మొత్తం 11 మంది మృతి చెందారు. అయితే ఈ దాడి ఎంబసీ లక్ష్యంగా జరిగి ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు. గాజా యుద్ధంలో  ఇరాన్‌ మిత్రదేశాల్ని ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగపడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలోనే.. తాజా దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్‌ […]

Israeli airstrikes on Gaza hospital : గాజా తాత్కాలిక ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి

మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి. డెయిర్‌ అల్‌-బలా: మధ్య గాజాలో కిక్కిరిసిపోయిన ఓ ఆసుపత్రి పెరడులో తాత్కాలిక శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం వైమానిక దాడి నిర్వహించాయి. ఈ ఘటనలో ఇద్దరు పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. పాత్రికేయులతో సహా 15 మంది గాయపడ్డారు. యుద్ధ కల్లోలిత ప్రాంతాల నుంచి వచ్చిన వందల మంది ప్రజలు ఈ ఆసుపత్రిలో ఆశ్రయం పొందతున్నారు. దాడితో మహిళలు, […]

Astronauts returned from space

భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఆరు నెలలకు పైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. కేప్‌ కెనావెరల్‌: భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఆరు నెలలకు పైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ ద్వారా ఫ్లోరిడా తీరం సమీపంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో జలాల్లో వీరు కిందకు దిగారు. అప్పటికే అక్కడ సిద్ధంగా […]

Japan: Japan’s first private rocket exploded within moments of launch..!

జపాన్‌ ప్రయోగించిన తొలి ప్రైవేటు రాకెట్‌ ల్యాంచ్‌ప్యాడ్‌కు అత్యంత సమీపంలోనే పేలిపోయింది. దీంతో ప్రైవేటు రాకెట్‌ సాయంతో ఉపగ్రహాలను వేగంగా కక్ష్యలోకి చేర్చాలన్న లక్ష్యం తీరలేదు.   జపాన్‌ (Japan) చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌లో చోటు చేసుకొంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్‌ రాకెట్‌ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగికి […]

PM Modi congratulated Mission Divyastra on success | మిషన్‌ దివ్యాస్త్ర విజయవంతం.. అభినందించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ విజయవంతమైంది. మిషన్‌ దివ్యాస్త్రలో భాగంగా భారత రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌(ఎంఐఆర్‌వీ) పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో అగ్ని-5 రేంజ్‌.. 7 వేల కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం ఉంది. మిషన్‌ దివ్యాస్త్ర విజయవంతంతో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. […]