Title for Rithvik-Nicky Jodi : రిత్విక్–నిక్కీ జోడీకి టైటిల్
హైదరాబాద్: సాన్ లూయిస్ ఓపెన్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీలో రెండో సీడ్ రిత్విక్–నిక్కీ కలియంద పునాచా (భారత్) ద్వయం చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో రిత్విక్–నిక్కీ జంట 6–3, 6–2తో ఆంటోనీ బెలీర్–మార్క్ హ్యుస్లెర్ (స్విట్జర్లాండ్) జోడీపై గెలిచి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 88 వేలు)ప్రైజ్‌మనీతోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లను సొంతం చేసుకుంది. రిత్విక్ […]