Interpol – ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్వీర్ సింగ్ కోసం కార్నర్ నోటీసు జారీ చేసింది.
తాజాగా తమ అధికారిక వెబ్సైట్లో దీనికి సంబంధించి వివరాలు పొందుపరిచింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘బాబర్ ఖాల్సా ఇంటర్నేషనల్’ గ్రూప్‌నకు చెందిన కరణ్వీర్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇంటర్‌పోల్ వెల్లడించిన వివరాల ప్రకారం 38 ఏళ్ల కరణ్వీర్ సింగ్ పంజాబ్‌లోని కపుర్తాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతడిపై భారత్‌లో హింసకు కుట్ర, హత్యలు, ఉగ్రవాద సంస్థలకు నిధుల సేకరణ, ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా వ్యవహరించడం తదితర నేరారోపణలు ఉన్నాయి. దీంతో […]