Vietnam TRUONG MY LAN : Female billionaire sentenced to death : వియత్నాంలో మహిళా బిలియనీర్‌కు మరణశిక్ష..
వియత్నాం రియల్ ఎస్టేట్ టైకూన్, బిలియనీర్ ట్రూంగ్ మై లాన్‌కు మరణశిక్ష పడింది. ఆ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో దోషిగా తేలడంతో ఆమెకు మరణశిక్ష విధిస్తూ హోచిమిన్ నగరంలోని ఓ కోర్టు గురువారం తీర్పునిచ్చిందని స్థానిక మీడియా చెబుతోంది. ‘వాన్ థిన్ ఫాట్ హోల్డింగ్స్ గ్రూప్’ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి చైర్‌పర్సన్‌గా ఉన్న 67 ఏళ్ల ట్రూంగ్ మైలాన్.. తన నియంత్రణలోనే ఉన్న ‘సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్’లో మోసానికి పాల్పడ్డారు. […]