Manipur Violence: మణిపుర్లో మళ్లీ కల్లోలం.. ఐపీఎస్ అధికారికి పిలుపు..
మణిపుర్లో మరోసారి కల్లోల పరిస్థితులు (Manipur Violence) నెలకొన్నాయి. విద్యార్థుల హత్యతో ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎస్ఎస్పీ రాకేశ్ బల్వాల్ (Rakesh Balwal)ను తన సొంత కేడర్ అయిన మణిపుర్‌కు బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ (Home Minitsry) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అల్లర్ల కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.