irregularities in mid-day meal scheme – మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో రాజస్థాన్(Rajasthan)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రెడ్ డైరీ కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి రాజేందర్ సింగ్ యాదవ్(Rajasthan Minister Rajendra Yadav) ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజన పథకంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఈ తనిఖీలు జరుగుతున్నాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి. రాజేందర్ సింగ్ యాదవ్.. జైపుర్‌లోని కోట్‌పుత్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కేబినెట్‌లో […]