Air Pollution – కాలుష్యంపై పోరు.. ‘కృత్రిమ వర్షానికి’ సిద్ధమవుతోన్న దిల్లీ!

రోజురోజుకు పెరిగిపోతోన్న కాలుష్యంతో (Air Pollution) దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రమాదకర స్థితిలో పెరిగిపోవడంతో నియంత్రణకు ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో క్లౌడ్‌ సీడింగ్‌ (Cloud seeding) విధానంలో కృత్రిమ వర్షాన్ని (Artificial Rain) కురిపించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఐఐటీ కాన్పూర్‌ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. నవంబర్‌ 20-21 తేదీల్లో దీనికి అనుకూలమైన వాతావరణం ఉండవచ్చని అంచనా వేసింది. క్లౌడ్‌ సీడింగ్‌ పద్ధతిలో కృత్రిమ వర్షాన్ని కురిపించి కాలుష్యానికి చెక్‌ […]