Chandrayaan-3 – భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నిర్వహించిన మహా క్విజ్ పోటీ.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నిర్వహిస్తున్న చంద్రయాన్‌-3 మహా క్విజ్‌ పోటీల్లో పాల్గొనాలని ఆ సంస్థ ఛైర్మన్‌ డా.సోమనాథ్‌ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. చంద్రయాన్‌-3 ఉపగ్రహ పరిశోధనలపై భారతీయుల్లో అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 16 లక్షల మంది భారతీయులు ఇందులో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ప్రశంసాపత్రంతోపాటు నగదు బహుమతి ఇస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఆధ్వర్యంలో అక్టోబరు 4వ తేదీ నుంచి […]