Rahul Gandhi’s surprise : సోనియాగాంధీకి బహుమతి

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తన తల్లి సోనియాగాంధీకి ముద్దులొలికే బుజ్జి కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. గత ఆగస్టు నెలలో గోవాలో పర్యటించిన రాహుల్‌ ‘జాక్‌ రస్సెల్‌ టెర్రియర్‌’ జాతికి చెందిన ఆడ కుక్కపిల్లను తనతోపాటు దిల్లీకి తీసుకువచ్చారు. కుక్కపిల్లను ఓ అట్టపెట్టెలో పెట్టి సోనియా ముందుంచి తెరవమని కోరారు. పెట్టెను తెరచిన వెంటనే ఆమె ముఖంలో ఎనలేని సంతోషం కనిపించింది. కుక్కపిల్లను అమాంతం ఎత్తుకొని, కుమారుడు రాహుల్‌ను ప్రేమగా హత్తుకున్నారు. ఈ కుక్కపిల్లకు ‘నూరీ’ […]