Telangana – ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ.

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. అక్టోబర్‌ 1న ప్రధాని రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి మోదీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి 1.35కి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌ బయల్దేరతారు. 2.05కి అక్కడికి చేరుకుని 2.15 నుంచి 2.50 వరకు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు  ‘భాజపా సమరభేరి’ సభాస్థలికి చేరుకుని 4 గంటల వరకు అక్కడే ఉంటారు. సభావేదిక నుంచి తెలంగాణలో […]

Prime Minister, says Kovind – మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం దేశం సురక్షితం

ప్రధానమంత్రిగా మోదీ ఉన్నంతకాలం నిస్సందేహంగా దేశం భద్రంగా ఉంటుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. మోదీ జీవితం, ఆయన అందించిన సేవలపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా బుధవారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కోవింద్‌ ప్రసంగించి.. ప్రశంసలు కురిపించారు. అసాధారణ వ్యక్తిత్వం, గొప్ప మనసున్న నేతగా ఆయన్ని అభివర్ణించారు. ‘‘పెట్టుబడులు, మేకిన్‌ ఇండియా కార్యక్రమం మన దేశాభివృద్ధికి ఊతంగా నిలుస్తున్నాయి. జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌.. ఈ త్రయం ద్వారా వ్యవస్థ మునుపెన్నడూ లేనంత విప్లవాత్మక మార్పుల్ని […]