Increased toll price.. What is toll tax? పెరిగిన టోల్ ధర.. ఏమిటీ టోల్ ట్యాక్స్? ఎందుకు చెల్లించాలి?
టోల్‌ట్యాక్స్ పెంచుతున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుం పెరుగుతుంది. ఈసారి పెరిగిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. పెరిగిన ఛార్జీల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10 అదనంగా చెల్లించాలి. తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20, బస్సు, ట్రక్కులకు వరుసగా రూ.25, […]