Prajwal Revanna Arrested : బెంగళూరులో బిగ్‌ ట్విస్ట్‌.. విదేశాల నుంచి రాగానే ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్ట్‌

బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్‌ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు. అక్కడ దిగిన వెంటనే ఆయన్ను​ ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్‌) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్‌ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు. పలువురు మహిళలపై ప్రజ్వల్‌ లైంగిక దాడి చేసినట్లు […]