Karimnagar : పోలింగ్ బూత్‌ల పెంపు..
గంటల తరబడి ఓటింగ్ కోసం వరుసలో నిలబడే కష్టాలను తొలగించే దిశగా యంత్రాంగం శ్రమిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల దిశగా అవసరమైన ఏర్పాట్లలో అధికారులు తలమునకలవుతోంది.. ఇందులో అన్నింటికన్నా ముఖ్యంగా పోలింగ్ బూత్‌లపై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒక్కో కేంద్రం వద్ద ఓటు వేసేందుకు పదుల సంఖ్యలో ఓటర్లు వరుసగా బారులు తీరి ఇక్కట్లను ఎదుర్కొన్న సందర్భాలను గుర్తించి.. ఈ సారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. […]