AP BJP: దిల్లీకి బయల్దేరిన దగ్గుబాటి పురందేశ్వరి

భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురందేశ్వరి (Daggubati Purandeswari) దిల్లీకి బయల్దేరారు అమరావతి: భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురందేశ్వరి (Daggubati Purandeswari) దిల్లీకి బయల్దేరారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై అధిష్ఠానంతో ఆమె చర్చలు జరపనున్నారు. ఇటీవలే జిల్లాల్లోని ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలను రాష్ట్ర నేతలు సేకరించారు. దీనిపై రూపొందించిన నివేదికను అగ్రనేతలకు భాజపా జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్‌ సమర్పించారు. తెదేపా-జనసేన కూటమిలో భాజపా చేరనుందనే […]

భూకబ్జా రెడ్డిగా మారిన చెవిరెడ్డి: అచ్చెన్నాయుడు

ఐదేళ్లపాటు ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్‌లో అక్రమంగా సంపాదించిన వైకాపా నేతలు.. అది చాలదంటూ పేదల భూములు లాక్కుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అమరావతి: ఐదేళ్లపాటు ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్‌లో అక్రమంగా సంపాదించిన వైకాపా నేతలు.. అది చాలదంటూ పేదల భూములు లాక్కుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం స్థలాల్లో పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెదేపా నేతలను గృహ నిర్బంధం చేసి […]

YS Sharmila: జగన్‌ ‘విశాఖ విజన్‌’ ప్రకటనపై షర్మిల సెటైర్లు.

అమరావతి: ‘విశాఖ విజన్‌’ పేరుతో సీఎం జగన్‌ (YS Jagan) చేసిన ప్రకటనపై ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పందించారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లూ పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘‘పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం […]

మళ్లీ జగన్‌ భజన

ఎడాపెడా సంక్షేమ పథకాల కోతలు, నిత్యావసరాల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర పన్నులు అమాంతం పెంచి నడ్డివిరవడాల ఊసే ఎత్తకుండా ‘ప్రతి కుటుంబానికి అంత చేశాం…ఇంత చేశాం’ అంటూ రెండేళ్లుగా ప్రజల చెవులు దిమ్మెక్కేలా ఇళ్ల ముందుకొచ్చి మరీ వాయించినా ముఖ్యమంత్రి జగన్‌కు తనివితీరినట్టు లేదు. అమరావతి: ఎడాపెడా సంక్షేమ పథకాల కోతలు, నిత్యావసరాల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర పన్నులు అమాంతం పెంచి నడ్డివిరవడాల ఊసే ఎత్తకుండా ‘ప్రతి కుటుంబానికి అంత చేశాం…ఇంత […]

Ponguleti Srinivas Reddy – నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌, ఖమ్మంలోని ఆయన నివాసాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఖమ్మంలో గురువారం వేకువజామున 3 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 8 వాహనాల్లో వచ్చిన ఈడీ  అధికారులు.. మూకుమ్మడిగా పొంగులేటి ఇంట్లోకి ప్రవేశించి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేడు నామినేషన్‌ వేసేందుకు పొంగులేటి సిద్ధమవుతున్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ తన నివాసంపై ఐటీ దాడులు జరగొచ్చని […]

Barrelakka Sirisha – కొల్లాపూర్‌లో నామినేషన్‌ వేశారు

తనపై కేసు పెట్టడంతో నిరసనగా నిరుద్యోగుల తరఫున కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటున్నట్లు కర్నె శిరీష అలియాస్‌ బర్రెలక్క పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్‌ గ్రామానికి చెందిన శిరీష బుధవారం కొల్లాపూర్‌లో రిటర్నింగ్‌ అధికారి కుమార్‌దీపక్‌కు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు… రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలిపేలా బర్రెలను కాస్తూ వీడియో తీసి యూట్యూబ్‌, సోషల్‌మీడియాలో పోస్టు చేసినందుకు తనపై పోలీసులు కేసు నమోదు […]

Nara Lokesh – వైకాపావి ఫేక్ ఎత్తుగడలు, అప్రమత్తంగా ఉండండి.

కుల, మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు.. తెదేపా అధినేత చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైకాపా ఫేక్ ఎత్తుగడల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నకిలీ లేఖతో చంద్రబాబుపై దుష్ప్రచారం: తెదేపా రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను రెచ్చగొట్టడమే […]

CM KCR – గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు

భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. గజ్వేల్‌లోని సమీకృత భవనంలో రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆయన అందజేశారు. నామినేషన్‌ అనంతరం కేసీఆర్‌ ప్రచార వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్.. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి ఆయన సమర్పించారు.

Minister Puvvada Ajay – వచ్చే ఎన్నికల్లో 88-90 స్థానాలు గెలుస్తాం..

భారాస మేనిఫెస్టోతో కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు కొట్టుకుపోయాయని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. ఖమ్మం భారాస కార్యాలయంలో అభ్యర్థుల మీడియా సమావేశంలో  మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భారాస సర్కార్‌ అమలు చేస్తున్న అనేక పథకాలను కేంద్రంలోని భాజపా సర్కార్‌ కూడా కాపీ కొట్టిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు 88 నుంచి 90 స్థానాలు వస్తాయని మంత్రి అజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. 

Chandrababu’s release – చంద్రబాబు విడుదలకు నిరసన

చంద్రబాబు నాయుడును త్వరగా విడుదల చేయాలని ఎన్టీఆర్ ఉద్యమ నేతలు, బాలకృష్ణ వర్గం, టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. వనపర్తి న్యూటౌన్ : టీడీపీ చైర్మన్ చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమాన సంఘం, టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయం వెలుపల ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట మాస్క్‌ ధరించి మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబును రహస్యంగా అరెస్టు చేసినందుకు ముఖ్యమంత్రి […]