ఎట్టి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి రాదు: విజయసాయిరెడ్డి
బాపట్ల: జగన్ పాలనలో ఏపీ అభివృద్ధి చెందిందని.. కాబట్టే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో వైఎస్సార్‌సీపీ నిర్వహించబోయే సిద్ధం ముగింపు సభ ఏర్పాట్లను గురువారం సాయంత్రం పర్యవేక్షించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికలకు సిద్ధం అయ్యాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మేదరమెట్ల సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మా అంచనా ప్రకారం 15 లక్షల మంది వస్తారని అనుకుంటున్నాం. సభా ప్రాంగాణాన్ని అవసరమైతే ఇంకో 200 ఎకరాలకు పొడిగిస్తాం. ఇదే ఆఖరి సిద్ధం […]