విశాఖ వీధుల్లో కేంద్ర బలగాలు, పోలీస్ ఫ్లాగ్ మార్చ్.. ఎందుకో తెలుసా..!

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశాఖ నగరంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించ్చారు. రానున్న ఎన్నికల కోసం విశాఖలో పోలీసులు, కేంద్ర బలగాలు, సన్నద్ధమవుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సాగేలా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నాకా బందీ నిర్వహించిన పోలీసులు.. కీలక పాయింట్లపై నిఘా పెట్టి […]

పవన్‌ కల్యాణ్ పోటీ చేయకపోతే టికెట్‌ వాళ్ళకే.. జనసేన నేతల హామీ!

ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. పాత పీఆర్పీ, టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతూ ఎప్పటికప్పుడు పార్టీ బలమెంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బలిజలకే టికెట్ ఇవ్వాలని అది కూడా లోకల్స్ కే ఇవ్వాలని పట్టు పడుతున్న ఆ సామాజిక వర్గం పవన్‌ పోటీ చేస్తే మాత్రం ఒకే అంటుండడం ఆసక్తికరంగా మారింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు. పాత పీఆర్పీ, టీడీపీ నేతలతో […]

ప్రజాపాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగింది: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: ప్రజా పాలనలో మహిళల ప్రాతినిథ్యం, భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. మహిళల సాధికారితతో పాటు ఆర్థిక స్వాలంబనకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ రూ.500 గ్యాస్ సిలిండర్ గ్యారంటీలను కొత్త ప్రభుత్వం అమల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు […]

ఎమ్మెల్యే మర్రి కళాశాల భవనం కూల్చివేత

దుండిగల్‌: మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌(ఐఏఆర్‌ఈ) కళాశాల భవనాన్ని కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టారంటూ ఇటీవల నోటీసులు ఇచ్చిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు నడుమ కళాశాల వద్దకు చేరుకున్నారు. జేసీబీలతో ఐదు అంతస్తుల శాశ్వత భవనాన్ని కూల్చివేయడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న కళాశాల విద్యార్థులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. […]

ఎమ్మెల్సీలపై మళ్లీ నిర్ణయం

హైదరాబాద్‌: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలంటూ రాష్ట్ర కేబినెట్‌ చేసిన సిఫార్సు లపై గవర్నర్‌ వ్యవహరించిన తీరు సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. సదరు సిఫార్సులను తిరస్క రిస్తూ 2023 సెప్టెంబర్‌ 19న గవర్నర్‌ ఇచ్చిన ఆదేశా లను రద్దు చేసింది. దీంతోపాటు గవర్నర్‌ ఆదేశాల మేరకు కోదండరామ్, ఆమెర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను కూడా రద్దు చేసింది. మళ్లీ […]

ఉమెన్స్‌ డే కానుక: గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు

 మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ‍ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.  కాగా, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గిస్తున్నట్టు ట్విట్టర్‌ వేదికగా మోదీ తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ‘ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా […]

రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం నిషేధం

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో.. పోటీలో ఉండే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయటం నిషిద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా పేర్కొన్నారు. అమరావతి:  ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో.. పోటీలో ఉండే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేల కంటే […]

TDP-Janasena-BJP: సీట్ల సర్దుబాటుపై నేడూ చర్చ!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లతో చర్చలు జరిపారు. దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లతో చర్చలు జరిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ […]

రాజకీయాల్లోకి షమి.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ?

టీమ్‌ఇండియా స్టార్‌ బౌలర్‌ షమి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: మరో స్టార్‌ క్రికెటర్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ షమి భాజపాలో చేరనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పశ్చిమ బెంగాల్‌ నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఎన్నికల్లో పోటీ విషయమై ఇప్పటికే భాజపా (BJP) అధిష్ఠానం ఈ క్రికెటర్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఈ చర్చలు సానుకూలంగా […]

బాబు, పవన్‌ పేరు చెబితే గుర్తుకొచ్చేవి ఇవే..: సీఎం జగన్‌

అనకాపల్లి జిల్లా: చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. వీరద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చి మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారంటూ సీఎం జగన్‌ నిప్పులు చెరిగారు. ‘‘2014లో ఒక్క వాగ్ధానం అయినా చంద్రబాబు అమలు చేశాడా?. […]