SoniaGandhi attend telangana foramation day celbration:  అవతరణ వేడుకలకు సోనియా గాంధీ….

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. జూన్‌ 2న ఉదయం 10 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు, సాయంత్రం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యక్తిగత ఆహ్వాన లేఖ పంపారు. ఈ లేఖతో పాటు ఆహ్వాన పత్రికను […]

Cheating Black Magic: Police Raids Simultaneously On The Houses Of Fake Baba :దొంగ స్వాముల ఇళ్ళపై ఏకకాలంలో పోలీసుల దాడులు

మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడుల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై దొంగ స్వాముల భరతం పట్టారు పోలీసులు. ఏకంగా బైండోవర్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడులకు సంబంధించిన వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు సీరియస్ యాక్షన్ షురూ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదేశాలు ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై దాడి చేశారు. మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడుల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై […]

Telangana’s 10th Anniversary Celebrations : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు..

జూన్‌ రెండున నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అందుకు సంబంధించిన పనులు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో శరవేగంగా జరుగుతున్నాయి. గౌరవ వందన సమర్పణ కోసం రిహార్సల్స్‌ చేస్తున్నారు పోలీసులు. జూన్‌ రెండున నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అందుకు సంబంధించిన పనులు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో శరవేగంగా జరుగుతున్నాయి. గౌరవ వందన సమర్పణ కోసం రిహార్సల్స్‌ చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో […]

Israel Hamas Conflict: గాజాలో యుద్ధం ఆపితే సంధికి సిద్ధమే: హమాస్‌

Israel Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం ఆపితేనే తాము సంధికి వస్తామని హమాస్‌ తేల్చి చెప్పింది. లేదంటే తాము ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనబోమని పేర్కొంది. Israel Hamas Conflict | గాజా: కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్‌ (Hamas) వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలని షరతు విధించింది. అప్పటి వరకు తాము ఎలాంటి సంధి చర్చల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఒప్పందం కోసం యత్నిస్తున్న మధ్యవర్తులకు తెలియజేశామని […]

Prajwal Revanna Arrested : బెంగళూరులో బిగ్‌ ట్విస్ట్‌.. విదేశాల నుంచి రాగానే ప్రజ్వల్‌ రేవణ్ణ అరెస్ట్‌

బెంగళూరు: ఎట్టకేలకు మహిళలపై లైంగిక దాడి, దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు,ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్‌ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం అర్ధరాత్రి దాటాక దిగారు. అక్కడ దిగిన వెంటనే ఆయన్ను​ ప్రత్యేక దర్యాప్తు పోలీసులు(సిట్‌) అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భారీభద్రత మధ్య ప్రజ్వల్‌ను విచారణ కోసం పోలీసుల సీఐడీ కార్యాయానికి తరలించారు. పలువురు మహిళలపై ప్రజ్వల్‌ లైంగిక దాడి చేసినట్లు […]

TDP: ప్రపంచంలో ఎక్కడున్నా ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయం: ఆనం వెంకటరమణారెడ్డి..

తప్పులు చేసినోళ్లు రాష్ట్రం వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. నెల్లూరు: తప్పులు చేసినోళ్లు రాష్ట్రం వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తితిదేకు చెందిన శ్రీవాణి ట్రస్టు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడున్నా తితిదే ఈవో ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు. బోర్డు సమావేశాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టించలేదని ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డిని ప్రశ్నించారు. […]

Phone Tapping Case: 1,200 ఫోన్లు ట్యాప్‌ చేశాం

హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో ఆధారాలను నిందితులు 45 నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే గత డిసెంబరు 4న రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు ఎస్‌ఐబీలోని కంప్యూటర్ల హార్డ్‌ డిస్క్‌లను కట్టర్లతో కట్‌ చేసినట్లు వెల్లడైంది. ఈ మేరకు ఆధారాల ధ్వంసం కేసులో కీలక నిందితుడు, సస్పెండైన సిరిసిల్ల డీసీఆర్‌బీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు పోలీసులకు వెల్లడించారు. న్యాయస్థానానికి సమర్పించిన అతడి నేరాంగీకార […]

Harish Rao: ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం: హరీశ్‌రావు

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్) వేదికగా తెలిపారు. హైదరాబాద్‌: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్) వేదికగా తెలిపారు. అర్బన్ ప్రైమరీ […]