Narayana Make Sensational Comments Against TDP Chief Chandrababu Naidu : ఎన్డీయే అధికారంలోకి రాకపోతే చంద్రబాబు నిర్ణయం ఇదే.. 

కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి రాదని, ఇండియా కూటమికి చంద్రబాబు మద్దతు ఇవ్వక తప్పదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతి బైరాగిపట్టేడలోని సిపిఐ కార్యాలయంలో నారాయణ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీకి 400 స్థానాలు రావని, ఎన్డీయేకు తగిన మద్దతు రాకపోతే ఆ కూటమి నుంచి బయటికి వచ్చే మొదటి వ్యక్తి చంద్రబాబేనని జోస్యం చెప్పారు నారాయణ. కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి రాదని, ఇండియా కూటమికి చంద్రబాబు మద్దతు ఇవ్వక తప్పదన్నారు సిపిఐ జాతీయ […]

Palnadu District SP Mallika Garg’s Key Comments On Election Violence : పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్‌ కీలక వ్యాఖ్యలు….

స్పెషల్ ఆపరేషన్ కౌంటింగ్ డే. ఆ రోజు అల్లర్లు జరగకుండా సజావుగా సాగేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లతో అప్పటి ఎస్పీపై బదిలీ వేటు వేసింది ఎన్నికల సంఘం. దీంతో పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే బాధ్యతలు తీసుకున్న రోజే కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడమే తన ముందున్న తక్షణ కర్యవ్యం అంటూ ప్రకటించారు మల్లికా. మల్లికా గార్గ్.. పల్నాడు ఎస్పీ. ఈమె ముందున్న స్పెషల్ […]

 Hyderabad Irrigation Officials Caught By ACB Taking Bribe Of One Lakh Rupees : అవినీతికి పాల్పడిన ఇరిగేషన్ అధికారులు.. ఏసీబీకి ఎలా దొరికారంటే.. 

నలుగురు ఇరిగేషన్ శాఖ అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఈఈ బన్సీలాల్‌తో పాటు ఇద్దరు ఏఈలు, సర్వేయర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం నలుగురిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్‎కు చెందిన బొమ్ము ఉపేంద్ర నాథ్ రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నలుగురు ఇరిగేషన్ శాఖ అధికారులు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లక్ష రూపాయలు లంచం […]

Hyderabad DEO Bans Sale Of Uniforms, Stationery In Schools:  తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఇకపై ప్రైవేట్‌ స్కూళ్లలో యూనీఫాం, బూట్లు, షూ అమ్మకాలు నిషేధం!

యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టుల అమ్మకాల పేరిట తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్‌ స్కూళ్ల అక్రమాలపై ప్రభుత్వం కొరడా విధించింది. స్టేషనరీ, పుస్తకాలు వంటి వాటిని లాభాపేక్ష లేకుండా అమ్ముకోవాలని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్‌ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌, మే 31: యూనిఫామ్‌లు, బూట్లు, బెల్టుల అమ్మకాల పేరిట తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్‌ స్కూళ్ల అక్రమాలపై ప్రభుత్వం కొరడా విధించింది. స్టేషనరీ, పుస్తకాలు వంటి వాటిని లాభాపేక్ష లేకుండా […]

North Korea provocation again : మళ్లీ ఉత్తర కొరియా కవ్వింపు

దక్షిణ కొరియాపై ముందస్తు దాడి జరిపే సత్తా తమకుందని చాటడానికి.. అణ్వస్త్రాలను మోసుకెళ్లగల రాకెట్లతో ఉత్తర కొరియా సైన్యం తమ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సమక్షంలో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. సియోల్‌: దక్షిణ కొరియాపై ముందస్తు దాడి జరిపే సత్తా తమకుందని చాటడానికి.. అణ్వస్త్రాలను మోసుకెళ్లగల రాకెట్లతో ఉత్తర కొరియా సైన్యం తమ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సమక్షంలో యుద్ధ విన్యాసాలు చేపట్టింది. ఉత్తర కొరియా గతంలోనూ ఇలాంటి విన్యాసాలు జరిపింది కానీ, ఇటీవల […]

Two Officials Arrested In The Telangana Sheep Distribution Scheme Scam : గొర్రెల స్కీంలో భారీ స్కాం.. రూ.700కోట్లు….

వేలు కాదు లక్షలు కాదు.. అక్షరాల 7వందల కోట్లు మింగేశారు. గొర్రెల పంపిణీ స్కీంను పెద్ద స్కాంగా మార్చేశారు. రైతులకు బదులు ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లలోకి నిధులు మళ్లించారు. ఈ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ.. త్వరలోనే అసలు సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. వేలు కాదు లక్షలు కాదు.. అక్షరాల 7వందల కోట్లు మింగేశారు. గొర్రెల పంపిణీ స్కీంను పెద్ద స్కాంగా మార్చేశారు. రైతులకు బదులు […]

Lok Sabha Election 2024: 7th Phase Final Stage Polling ….తుది అంకానికి చేరుకున్న లోక్‌సభ ఎన్నికలు..

ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఏడోవ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 57 లోక్‌‌సభ స్థానాల్లో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఒడిశాలోని మిగిలిన 42 అసెంబ్లీ స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు ఈరోజే ఓటింగ్ జరగనుంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. […]

Criminal Case On Sajjala :సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్‌ కేసు…

వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)పై క్రిమినల్‌ కేసు నమోదైంది. అమరావతి: వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)పై క్రిమినల్ కేసు నమోదైంది. కౌంటింగ్‌ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తెదేపా నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై […]

AP Govt: ఏబీవీని సర్వీసులోకి తీసుకోవాలి.. ఏపీ సీఎస్‌ ఆదేశాలు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara rao)ను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఎత్తివేసింది. ఇవాళే ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను […]

Union Home Minister Amit Shah visited Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అమిత్‌షాకు శ్రీవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఈవో అందజేశారు.