MLC BTech Ravi – పులివెందులులో పార్టీని గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తాం….ఎమ్మెల్సీ బీటెక్ రవి…
పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టీడీపీని గెలిపించి అధినేత చంద్రబాబుకు కానుక అందించడం ఖాయమని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రకటించారు. బుధవారం పులివెందులలో బ్రాహ్మణపల్లె రోడ్డు పక్కన పార్టీ భవన సముదాయాన్ని బీటెక్ రవి అధికారికంగా ప్రారంభించారు. ఇది అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. కడప లోక్‌సభ స్థానంలోనూ, పులివెందుల నియోజకవర్గంలోనూ విజయం సాధించాలని కోరుతూ బీటెక్ రవి దంపతులు రాజశ్యామల యాగం ఏర్పాటు చేశారు.