Asaduddin Owaisi’s – వ్యాఖ్య:చంద్రుడు హ్యాపీగా జైల్లో.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారని, అక్కడ ఆయన ప్రశాంతంగా ఉన్నారని, చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పాలన మంచిగానే ఉందని, చంద్రబాబును మాత్రం నమ్మలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోనూ తమ పార్టీ గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.