GV Anjaneyulu: హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదు?: జీవీ ఆంజనేయులు

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు వ్యవహారంపై తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఓ ప్రకటనలో మండిపడ్డారు. అమరావతి: కారంపూడి సీఐపై హత్యాయత్నం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. పోలీసునే చంపబోయిన వ్యక్తి ముందు ఎందుకు సాగిలబడుతున్నారని నిలదీశారు. పిన్నెల్లికి హైకోర్టు రక్షణ కల్పించింది ఈవీఎం ధ్వంసం కేసులో మాత్రమేనని తెలిపారు. విధుల్లో ఉన్న సీఐని కొట్టి గాయపరిచినా అరెస్టుకు ఎందుకంత భయమన్నారు. రాష్ట్రమంతా ముక్కున వేలేసుకుంటున్నా పోలీసుల్లో కనీస చలనం లేదని ఎద్దేవా […]