Phone Tapping Case: 1,200 ఫోన్లు ట్యాప్‌ చేశాం

హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో ఆధారాలను నిందితులు 45 నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు అంటే గత డిసెంబరు 4న రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు ఎస్‌ఐబీలోని కంప్యూటర్ల హార్డ్‌ డిస్క్‌లను కట్టర్లతో కట్‌ చేసినట్లు వెల్లడైంది. ఈ మేరకు ఆధారాల ధ్వంసం కేసులో కీలక నిందితుడు, సస్పెండైన సిరిసిల్ల డీసీఆర్‌బీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు పోలీసులకు వెల్లడించారు. న్యాయస్థానానికి సమర్పించిన అతడి నేరాంగీకార […]

Phone tapping case Radhakishan Rao’s remand extended : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు : రాధాకిషన్‌రావు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్‌ చోటుచేసుకుంటోంది. తాజాగా ఈ కేసు వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 12 వరకు రిమాండ్‌ విధించిన అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాధాకిషన్‌రావుకు సంబంధించి వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక, విచారణ సందర్భంగా తనను జైలులో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం […]