Accessible digital libraries-అందుబాటులోకి డిజిటల్ లైబ్రరీలు
విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా గ్రంథాలయాలను డిజిటల్‌గా తీర్చిదిద్దుతామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురువారం పెద్దపల్లిలో రూ.కోటి అంచనాతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పుట్టా మధుకర్, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ గిరీష్బాబు, డీఈఈ శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి లైబ్రరీ చైర్మన్ రఘువీర్ సింగ్ అధ్యక్షత వహించారు.