China : ప్రమాదానికి గురైన జలాంతర్గామి
ఎల్లో సముద్ర జలాల్లో చైనాకు చెందిన ఓ అణు జలాంతర్గామి ప్రమాదానికి గురై అందులోని 55 మంది నావికులు దుర్మరణం పాలయ్యారు. అమెరికా, దాని మిత్రపక్షాలకు చెందిన సబ్మెరైన్లు తమ క్వింగ్డావ్ నౌకాదళ స్థావరం ప్రాంతంలోకి ప్రవేశించకుండా సముద్రం అడుగున చైనా నిర్మించిన గొలుసుల ఉచ్చులోనే ఆ దేశ జలాంతర్గామి చిక్కుకుని ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రమాదంపై బ్రిటన్‌కు చెందిన పలు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ‘‘చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌లోని ఎల్లో […]