IIT Bombay : వెజ్ – నాన్‌వెజ్ వివాదం
ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో కొద్ది నెలల క్రితం తలెత్తిన వెజ్ – నాన్‌వెజ్ వివాదాన్ని అధికారులు ఓ కొలిక్కి తెచ్చారు. వసతిగృహంలో నిరసన తెలిపిన విద్యార్థుల్లో ఒకరికి ఇన్‌స్టిట్యూట్ మెస్ కౌన్సిల్ రూ.10 వేల జరిమానా విధించింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఇతర విద్యార్థులను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు. అక్టోబరు 1న సమావేశమైన మెస్ కౌన్సిల్ శాకాహార విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆరు టేబుళ్లను కేటాయించాలని నిర్ణయించింది. ఆ టేబుళ్లపై వెజ్ భోజనం మాత్రమే చేయాలని […]