Preservation of priceless-వెలకట్టలేని చారిత్రక ఆధ్యాత్మిక కట్టడాల పరిరక్షణ….
భిక్కనూరు: అమూల్యమైన చారిత్రక, ఆధ్యాత్మిక కట్టడాలను పరిరక్షించడం అందరి బాధ్యత అని కలెక్టర్ జితేష్ పాటిల్ పేర్కొన్నారు. సోమవారం కుటుంబ సమేతంగా భిక్కనూరులోని సిద్ధరామేశ్వర దేవాలయం మైదానంలో మెట్లబావి(కోనేరు) వద్దకు వెళ్లారు. శిథిలావస్థలో ఉన్న కోనేరును చక్కగా పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రెయిన్ వాటర్ ప్రాజెక్టు రూపకర్త కల్పనరమేష్, నిధులు సమకూర్చిన దాత నిర్మలా గోవిందంను అభినందించారు. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త మరియు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ యొక్క CEO అయిన శివనాగి రెడ్డి […]