ఆ గాయం నుంచి కోలుకోవాలంటే సమయం పడుతుంది: సమంత
సినిమాలకు విరామం ప్రకటించినప్పటికీ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘మనపై మనకున్న విశ్వాసం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సాయపడుతుంది. నేను అభద్రతాభావానికి లోనవుతున్నానని తెలుసుకోగలిగాను. త్వరగా దాని నుంచి బయటకు వచ్చాను. బాహ్య గాయాల కంటే మనసుకైన గాయం నుంచి కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది’ అని ఆమె ఓ మ్యాగజైన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. […]