Navdeep: రేవ్ పార్టీ.. నా విషయంలో నిరుత్సాహపడ్డారేమో: నవదీప్
బెంగళూరు రేవ్ పార్టీ గురించి ప్రశ్న ఎదురవగా నటుడు నవదీప్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే? ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల హాట్‌టాపిక్‌గా నిలిచిన బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్టు రూమర్స్ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని భావిస్తున్నట్టు నటుడు నవదీప్ (Navdeep) అన్నారు. ‘ఏంటన్నా. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్‌లో కనిపించడంలేదు’ అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపారు. తన కొత్త సినిమా ‘లవ్ మౌళి’ (Love Mouli) ప్రచారంలో భాగంగా పాల్గొన్న […]