National Film Awards : ఉత్తమనటుడిగా అల్లు అర్జున్‌ అవార్డు అందుకున్నారు

69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరుగుతోంది. 2021కి గాను కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడిగా ‘పుష్ప’ సినిమాకు టాలీవుడ్‌ ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ (Allu Arjun) అవార్డు అందుకున్నారు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్‌ (పుష్ప) అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డును అలియా భట్‌ (గంగూభాయి కాఠియావాడి), […]