Chhattisgarh – అంజోరా గ్రామంలో ఇద్దరు ఎమ్మెల్యేలు!
ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఛత్తీస్‌గఢ్‌లోని అంజోరా గ్రామంలో నాయకుల ప్రచారం హోరెత్తుతోంది. అయిదు వేల జనాభా ఉన్న ఈ గ్రామం రెండు శాసనసభా నియోజకవర్గాల పరిధిలో ఉండటం ప్రత్యేకత. అటు దుర్గ్, ఇటు రాజనందగావ్ జిల్లాల పరిధిలో రెండు భాగాలుగా ఈ గ్రామం ఉంది. గ్రామ వీధుల్లో ఒక వరుస రాజనందగావ్ సెగ్మెంటు పరిధిలోకి వస్తే, మరో వరుస దుర్గ్ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. గ్రామంలోని కొన్ని కుటుంబాల ఓట్లు రెండు నియోజకవర్గాల మధ్య చీలి […]