Timmapur Village – ప్రజలు లేని పల్లె.
నల్గొండ: రికార్డుల్లో రెవెన్యూ గ్రామమైన తిమ్మాపూర్‌లో నేడు ఒక్కరూ నివాసం లేకపోవడంతో ప్రజలు లేని పల్లెగా మారింది. 70 సంవత్సరాల క్రితం వ్యవసాయబావుల వద్ద ఐదు కుటుంబాలు (వంగాల మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీరాంరెడ్డి, మధూసరెడ్డి, కుమ్మరి నర్సింహ) ఇళ్లు నిర్మించుకొని 60 సంవత్సరాల పాటు తిమ్మాపూర్ గ్రామంలో జీవనం సాగించారు. కాలక్రమంలో అంటువ్యాధులు ప్రబలి కొందరు ఊరు వదిలి పోగా మరికొందరు ఉపాధిని వెతుక్కుంటూ నెమ్మాని, పరడ, హైదరాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఏపీ లింగోటం, నార్కట్‌పల్లి, చిట్యాల, వెంకటేశ్వర్లబావి, […]