Nalgonda : వానాకాలం పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంపు అంతంత మాత్రంగానే ఉంది
కేంద్ర ప్రభుత్వ వానాకాలం పంటల మద్దతు ధర పెంపు అంతంత మాత్రంగానే ఉంది. పెరిగిన పెట్టుబడులతో పోల్చితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సేకరించే పంటలకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా లేకపోవడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధికంగా సాగయ్యే వరికి ఏ గ్రేడ్ రకానికి రూ.2203 ఇచ్చేలా ఎఫ్‌సీఐని ఆదేశించింది. పత్తి ఏ గ్రేడ్‌కు రూ.7020, బీ గ్రేడ్‌కు రూ.6620కి కొనాలని నిర్ణయించింది. ఈ ధరలు మాత్రం లాభదాయకంగా లేవని కర్షకులు వాపోతున్నారు. కేంద్రం […]