ISRO – శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 2035 కల్లా సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోవడం, 2040 నాటికి భారతీయుడిని చంద్రుడిపైకి పంపడం వంటి సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకొని కృషిచేయాలని సూచించారు. మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో తొలిసారిగా తలపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘గగన్‌యాన్‌’ మిషన్‌లో భాగంగా తొలి క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ను ఈ నెల 21న పరీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో […]

Prime Minister, says Kovind – మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం దేశం సురక్షితం

ప్రధానమంత్రిగా మోదీ ఉన్నంతకాలం నిస్సందేహంగా దేశం భద్రంగా ఉంటుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. మోదీ జీవితం, ఆయన అందించిన సేవలపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా బుధవారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కోవింద్‌ ప్రసంగించి.. ప్రశంసలు కురిపించారు. అసాధారణ వ్యక్తిత్వం, గొప్ప మనసున్న నేతగా ఆయన్ని అభివర్ణించారు. ‘‘పెట్టుబడులు, మేకిన్‌ ఇండియా కార్యక్రమం మన దేశాభివృద్ధికి ఊతంగా నిలుస్తున్నాయి. జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌.. ఈ త్రయం ద్వారా వ్యవస్థ మునుపెన్నడూ లేనంత విప్లవాత్మక మార్పుల్ని […]