PM Modi congratulated Mission Divyastra on success | మిషన్ దివ్యాస్త్ర విజయవంతం.. అభినందించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా భారత రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) ఈ ప్రయోగం చేపట్టింది. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్(ఎంఐఆర్‌వీ) పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ప్రాజెక్టు భారత అణు నిరోధక శక్తిని పెంచే లక్ష్యంతో అగ్ని-5 రేంజ్.. 7 వేల కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం ఉంది. మిషన్ దివ్యాస్త్ర విజయవంతంతో డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. […]