Mexico : ఘోర బస్సు ప్రమాదం..
మెక్సికో (Mexico)లో ఘోర బస్సు ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. వలసదారులతో ప్రయాణిస్తోన్న బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 18 మంది మృతి చెందారు. మరో 27 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దక్షిణ మెక్సికోలోని వుహకా-పేబ్లా ప్రాంతాలను కలిపే రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతుల్లో వెనుజువెలా, హైతికి చెందిన ముగ్గురు మైనర్లున్నారు. వివిధ దేశాలకు చెందిన వేలాది మంది తరచూ మెక్సికో గుండా అక్రమంగా అమెరికాలోకి […]